Fake IAS Stir : కామారెడ్డి కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్ హల్చల్

TRINETHRAM NEWS

Trinethram News : నేను ఐఏఎస్‌ను.. ఇంచార్జి కలెక్టర్ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో మహిళ హంగామా…. తనకు ఉద్యోగం వచ్చినట్టు కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ విఫల ప్రయత్నమని నిర్ధారించిన పోలీసులు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ నెల 2వ తేది నుండి సెలవులో ఉండగా, ఇంచార్జి కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం

ఈ నెల 4వ తేదీన కామారెడ్డి కలెక్టరేట్‌కు కారులో వచ్చి, కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి, తనను ఇంచార్జి కలెక్టర్‌గా నియమించారని ఉత్తర్వులు చూపించిన హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళ.. ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించామని, పైనుండి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని మహిళకు తెలిపిన అదనపు కలెక్టర్.. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో, అనుమానంతో పోలీసులకు సమాచారం అందించిన కలెక్టరేట్ సిబ్బంది

సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా, 2020 నుండి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసిందని పోలీసుల నిర్ధారణ.. దీంతో మహిళపై చీటింగ్ కేసు పెట్టి ఆమెను వదిలేసిన పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fake IAS stir in Kamareddy

You cannot copy content of this page

Scroll to Top