TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ వైరల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఫేక్ న్యూస్ అని, ఈ న్యూస్తో తమ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మార్చి 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.