Internal Marks : పదవ తరగతి మార్కుల పరిశీలన

TRINETHRAM NEWS

ఘనంగా జీహెచ్‌ఎం రేబాక సన్మానం.

డిండి (గుండ్లపల్లి) ఫిబ్రవరి 26, త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్లపల్లి )మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల మూల్యాంకన ప్రక్రియను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మండలంలోని జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి, జెడ్పీహెచ్ఎస్ డిండి ప్రాజెక్ట్ పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్, కేజీబీవీ మరియు ఆర్పీఆర్పీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను తనిఖీ బృందం సందర్శించింది.

ఘనంగా సన్మానం:

ఈ తనిఖీ ప్రక్రియలో భాగంగా వచ్చిన జీహెచ్‌ఎం రేబాక సదానందం ను, స్థానిక మండల విద్యాధికారి ఇస్లావత్ గోప్యా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రేబాక మేడం మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో, ఆమె సేవలను కొనియాడుతూ ఈ వీడ్కోలు సన్మానాన్ని ఏర్పాటు చేశారు.

గత రెండు సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థుల ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కుల తనిఖీ కోసం రేబాక మేడం టీమ్ తమ మండలానికి రావడం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సహకరించడం సంతోషకరమని ఎంఈఓ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రేబాక మేడం టీమ్ సభ్యులు బి. శ్రీను, సంధ్యారాణిలతో పాటు స్థానిక ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని విద్యా వ్యవస్థ పటిష్టతకు ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆమెకు శేష జీవితం ప్రశాంతంగా గడవాలని విద్యాశాఖ అధికారులు ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Examination of class 10 marks

You cannot copy content of this page

Scroll to Top