TRINETHRAM NEWS

సావిత్రీబాయి ఫులే ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి..

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భూపాలపల్లి కలెక్టరేట్
మహాత్మా జ్యోతి బాపులే సతీమణి, బాలికా విద్య కోసం కృషి చేసిన సావిత్రీబాయి ఫులే చేసిన పోరాటం ప్రతీ ఒక్కరికీ స్పూర్తిదాయకమని, వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం రోజున సావిత్రీ బాయి ఫులే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రాహుల్ శర్మ, ఇతర జిల్లా అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం సావిత్రీబాయి ఫులే చిత్రం పటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రజా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుందని అన్నారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3) ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమన్నారు. సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సందర్భంగా ఫూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకోవాలని కోరారు. సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని అన్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని సైతం లెక్కచేయలేదని గుర్తుచేశారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సావిత్రీబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్దికి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అనంతరం పలువురు టీచర్లకు జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందించి సన్మానం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App