TRINETHRAM NEWS

Establishment of check posts at district borders to control illegal traffic

నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్‌ బృందాలు నిరంతరం ప్రత్యేక నిఘా..

నకిలీ,కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు పీడీ యాక్ట్ అమలు

అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లా సరిహద్దులలో చెక్ పోస్ట్ ల ఏర్పాటు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులకు నకిలీ, కల్తీ విత్తనాల నిషేధిత హెచ్ టి కాటన్ విత్తనాలను తనిఖీలలో గుర్తించడం కోసం పాటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి పోలీస్ అధికారులకు వివరించడం జరిగింది
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం సూచనలు సలహాలు నిబంధనలకు అనుగుణంగా డీలర్లు విత్తనాలు విక్రయించాలి. విత్తన డీలర్లు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసిన, దుకాణాలలో, ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించిన ,ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం విత్తనాలు అమ్మిన, నకిలీ విత్తనాలు అమ్మిన, నిల్వచేసిన రవాణా చేసిన,నకిలీ దందా చేస్తున్నట్లు తెలిసిన తీవ్రమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విత్తనాల ఎరువుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించాలి అధికారులకు తెలిపారు. విత్తన దుకాణాలను, గోదాములను, తయారీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో లైసెన్స్ ఉందా లేదా, ఉంటె ఫారం –Bలేదా ఫారం -C (రేనివాల్ ) చెక్ చేయాలి, సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ఇచ్చిన ఆతరైజేషన్ సర్టిఫికెట్ ఉన్నదా లేదా చెక్ చేయాలి. సీడ్స్ లైసెన్స్ మరియు దాని వ్యాలిడిటీని చెక్ చేయాలి, ధరల పట్టికను, బిల్స్ మరియు స్టాక్ రిజిస్టర్ లో హోల్ సేల్ రిటైల్ సీడ్ స్టాక్, ఇన్ వాయిస్, డెలివరీ చలాన్స్, స్టాక్ వివరాలు, ఉన్న స్టాక్ వివరాలు బుక్ బ్యాలెన్స్ తో సరిపోతున్నాయా లేదా చెక్ చేయాలి. ప్యాకింగ్ సరిగా ఉందా లేదా టాగ్స్, లేబుల్స్ యూస్ చేస్తున్నారా లేదా, సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైర్ కు సంబంధించిన కంపెనీ వివరాలు, డేట్స్ చెక్ చేయాలి. అనుమానస్పదంగా ఏవైనా విత్తనాలు గుర్తించినట్లయితే సంబంధిత MAO తో విత్తనాలను ల్యాబ్ టెస్టింగ్ కి పంపించాలి. కొనుగోలు చేసిన ఎరువులు విత్తనాలు పురుగు మందులకు సంబంధించి రైతులు డీలర్ల నుంచి రసీదులు ఇస్తున్నారా లేదా చెక్ చేయాలి .పాకెట్స్ పై సర్టిఫైడ్ అథారిటీ లేబిల్ మార్క్ ఉందా లేదా చెక్ చేయాలి ,రికార్డ్స్ లలో స్టాక్ డీటెయిల్స్ నమోదు చెక్ చేయాలి అని సూచించారు నకిలీ విత్తనాల సమస్యలను నియంత్రించేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సమాచారం వ్యవస్థను పటిష్టం చేయాలనీ తెలిపారు. దీనికి తోడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు., అదేవిధంగా నకిలీ విత్తనాల విక్రయాలలో గతంలో కేసులు నమోదైన వారిపై నిఘా వుంచి తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేయాలన్నారు
ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, సిసిఅర్బీ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, కమీషనరేట్ పరిధిలోని సీఐ, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App