
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎం.డి సిరాజుద్దీన్… సిరాజుద్దీన్ అరెస్ట్
Ensure Justice : త్రినేత్రం న్యూస్ /షాద్నగర్ ప్రతినిధి.. ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఎండి సిరాజుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిరాజుద్దీన్ ను షాద్ నగర్ పోలీసులు అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ముందస్తు చర్యల నిమిత్తం అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా సిరాజుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు గుర్తింపు హెల్త్ కార్డులు 25వేల గౌరవ వేతనం పెన్షన్ అందజేస్తామని ఎన్నో హామీలు గుప్పించిందని ప్రభుత్వం వచ్చాక వాటిని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిరాజుద్దీన్ డిమాండ్ చేశారు. ఉద్యమకారుల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

