Trinethram News : 6th Jan 2024
18 తర్వాత సమ్మెలోకి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు…
తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 18 తర్వాత సమ్మెబాట పడుతాం. దాదాపు 16 ఏళ్లుగా పని చేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం రూ.26 వేలివ్వాలి. పని దినాల టార్గెట్ విధానం రద్దు చేయాలి. మున్సిపాల్టీ విలీన గ్రామాల్లో యథావిధిగా ఉపాధి పనులు కల్పించాలి. మూడేళ్లు పూర్తైన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్టీఈ అమలు చేయాలి. అర్హత కల్గిన వారికి పదోన్నతులు కల్పించాలి. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. లేకుంటే ఉద్యమ బాట పట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
నరసింహ, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు