Efforts will be made to develop Sultanabad Mini Stadium
తాత్కాలిక మరమ్మతులకు నిధుల కేటాయింపు
క్రీడలకు పుట్టినిల్లు
సుల్తానాబాద్
క్రీడా రంగాన్ని విస్మరించిన గత ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడా రంగానికి పెద్ద పీట
ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీ లో గల మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఖేలోఇండియా ఖో ఖో శిబిరాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సందర్శించారు.
ఈ సందర్భంగా
క్రీడాకారులకు టీ షర్టులు, క్రీడా సామాగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విజయ రమణారావు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గత మూడు, నాలుగు దశాబ్దాలుగా సుల్తానాబాద్ పట్టణం క్రీడలకు పుట్టినిల్లుగా విరజిల్లుతోందని అన్నారు. ఎంతోమంది క్రీడాకారులు జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సుల్తానాబాద్ పేరును దశ దిశల ఖ్యాతి ని పెంచారని గుర్తు చేశారు. ఇదే పరంపర కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. మినీ స్టేడియం ఫంక్షనింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.
స్టేడియం అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని, తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.3 లక్షల వరకు నిధులు కేటాయించడం జరుగుతుందని క్రీడాకారుల హర్షద్వానాల మధ్య ఆయన ప్రకటించారు. స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడు అయిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఆసియా, కామన్వెల్ గేమ్స్ లో తెలంగాణ సత్తా చాటేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు.క్రీడాకారులు గ్రామీణ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. డి వై ఎస్ ఓ సురేష్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమతా కృష్ణ,సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం. రవీందర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఖో ఖో ఆటను తిలకించి క్రీడాకారులను, చిన్నారులను అభినందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App