చదువు ఆయుధం లాంటిది
చదివే సమాజాన్ని మార్చే ఆయుధం సెయింట్ జూడ్స్ ప్రైమరీ ప్రిన్సిపల్ ఉషారాణి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సమాజంలో చదువు ఆయుధం లాంటిదని సెయింట్ జూడ్స్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ ఉషారాణి అన్నారు.జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆమె కొన్ని విషయాలు మాట్లాడారు. ప్రతి ఏటా నవంబర్ 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడానికి ఒక ప్రత్యేకతుందన్నారు. భారతదేశానికి మొట్టమొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గౌరవార్థంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. భారతదేశంలో ఉన్నత విద్యకు బీజం పోసిన మహా వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అన్నారు. దేశంలో ఉన్నత విద్యకు ఊపిరి పోసిన మహనీయునిగా ఆజాద్ ను అభిమానిస్తుంటారు అన్నారు.
చదువు ఆయుధం లాంటిది
చదువు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఉషారాణి విద్యార్థులకు సూచించారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల్లో భయం ఉత్సాహం ఉంటుందని తమ లక్ష్యాన్ని సాధించే దిశగా దృష్టి సారించాలన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యం గొప్పగా ఉండాలని ఆమె సూచించారు. చదువులో డిగ్రీలు ముఖ్యం కాదని నైపుణ్యంతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. విద్యతోనే భవిష్యత్తును మార్చుకోవాలని ఉషారాణి అన్నారు. విద్యతో భవిష్యత్తును మార్చుకోవచ్చని విద్యా ప్రతి ఒక్కరికి ఆయుధం లాంటిదని ఆమె వివరించారు. పాఠ్యాంశాలపై తర్ఫీదు, మనోధైర్యాన్ని, వ్యక్తిగత నైపుణ్యానికి పెంపొందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు సమాజంలో ఎందరో ఉన్నారని విద్యార్థులు వారి సేవలను వినియోగించుకోవాలని ఉషారాణి సూచించారు. చదువు ఒక్కటే సమాజాన్ని మార్చగలదని ఆ చదువును ప్రతి విద్యార్థి ప్రేమించి ఆస్వాదించాలని ఉషారాణి అన్నారు. ప్రపంచీకరణ విధానాలకు లోబడకుండా భవిష్యత్తు లక్ష్యసాధనకై కృషి చేయాలని విద్యకు దూరంగా ఉన్న విద్యార్థులకు విద్యను అందించేలా తోటి విద్యార్థుల ఆలోచన మెరుగుపడాలని కోరారు. ఉన్నత స్థాయికి ఎదగాలని నేటి సమాజంలో మారుతున్న విద్యారంగంతో విద్యార్థుల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేపడుతున్నాయని అన్నారు. ఎటువంటి భ్రమలకు లోబడకుండా శాస్త్రీయ విద్యతో మెలగాలని ఆమె అన్నారు. విద్యార్థులు అంకిత భావంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆమె అన్నారు. సమాజంలో ఉన్నతంగా జీవించాలన్న గౌరవంగా ఉండాలన్న ఉన్నత పదవులు చేపట్టాలన్న చదువు ఒక్కటే ఆయుధమని ఆమె విద్యార్థులకు సమాజానికి సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App