TRINETHRAM NEWS

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారింది. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది.

పల్నాడు, మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేటలో హింసాత్మక ఘటనలు జరిగాయి.

కాగా ఈ ఘటనలపై రేపు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు.