Trinethram News : అమరావతి
గ్రామ సచివాలయాలు మరియు మీసేవ అప్లికేషన్లపై ఈసీ దృష్టి పెట్టారు…
గత ఎన్నికల నేపథ్యంలో కుల సర్టిఫికెట్ల కోసం అవస్థలు పడినట్లు గుర్తించారు..
అలాంటి అవస్థలు పడకుండా ఉండటం కోసం పెండింగ్ అర్జీలపై ఆరా తీస్తున్నారు…
జనన & మరణ మరియు కుల, ఆదాయ, ఫ్యామిలీ నెంబర్ మరియు సర్వేలు, పాస్ పుస్తకాలు, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయో ఆయా జిల్లా కలెక్టర్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు…
సచివాలయాలలో సిటిజన్ చార్ట్ పై రంగులను అదేవిదంగా
జగనన్నకు చెబుదాం, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని సూచించారు.
రేషన్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ, పాసు పుస్తకాలు, పై ముద్దు నిచ్చినటువంటి సీఎం చిత్రపటాన్ని వెంటనే తొలగించాలని కోరారు…
కొన్ని జిల్లాలలో ప్రభుత్వ స్థలాలలో ఫ్లెక్సీలను 24 గంటలు గడుస్తున్న ఇంకా తెలియకపోవటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేశారు…
ఇమెయిల్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు…
రేపు సాయంత్రం ఐదు గంటల లోపు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలలో రంగులు, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించిన యెడల సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.