TRINETHRAM NEWS

రాజమహేంద్రవరం మార్చి, 30. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక తిలక్ రోడ్ లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్,

ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు. ఉగాది వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర మాజీ హోసింగ్ బోర్డు చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి తదితరులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంతో జీవించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని విమర్శించారు. రైతులు సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్తు రుణమాఫీ పథకాలు ప్రవేశపడితే రెండోవాడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు పంట వేసిన దగ్గర నుంచి విక్రయించే వరకు గిట్టుబాటు ధర అందించే చర్యలు చేపట్టారని అన్నారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కనీస ధర్మం అని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. Guduri Srinivas Ugadi