TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : భారత రాజ్యాంగ నిర్మాత బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటారనితనం వివక్షాలపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశాదిశాలను చూపిన పూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి, స్మరించుకుంటూ పాడేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసన సభ్యులు వైసిపి జిల్లా అధ్యక్షులు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

_శాసన సభ్యులు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతీయ సమాజానికి సూచించిన మార్గం దేశానికి ఒక గొప్ప ఆదర్శం అని అన్నారు. వెనకబడిన వర్గాలకు వాల హక్కులు చట్టాలు కాపాడుకోవడానికి, తమ జీవితాంతం కూడా పోరాటం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 75 ఏళ్లు దాటిన అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం దళిత ఆదివాసి గిరిజనులు ఇంకా వెనుకబడి ఉండడానికి, గల కారణాలు ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్రాల్లోని పరిపాలించిన పాలకులు అధ్యయనం చేసిన దాఖలాలు లేవు. రాజ్యాంగంలోని ప్రత్యేకంగా ఆదివాసి గిరిజనులకు చోటు కల్పించి ప్రత్యేక హక్కులు, చట్టాలు కల్పించి గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే అటవీ ప్రాంతాల్లో ఉన్న భూములు గిరిజన ప్రాంత ప్రజలకే చెందాలి. అని ఒక ప్రత్యేక పోరాటం చేసి గిరిజనులకు ప్రోత్వహించారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుస పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్ కుమార్, ఊర్వశిరాణి, మాజీ సర్పంచ్ శరభ సూర్యనారాయణ, కిల్లో కోటిబాబు నాయుడు, కొణతాల ప్రశాంత్, కూడి వలసం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. B R. Ambedkar's portrait was paid