TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, జగన్నాధపురం గ్రామం

అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జగన్నాధపురం మరియు అంబేద్కర్ నగరాల్లో అంబేద్కర్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడిమే వంశీ మరియు అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు తోకల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. B.R. Ambedkar's 134th birth anniversary