TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ జయంతి సందర్భంగా డిండి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహనీయుని విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.

డిండి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొల్లె శైలేష్ మాట్లాడుతూ అనగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాపాలనకు దిక్సూచి అని గుర్తు చేశారు.
మహాశయుని ఆశయాల స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం చేసిన కృషి అంబేద్కర్ పూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా డిండి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుర్రం రాములు, మేకల కాశన్న, ఒంగోలు శేఖర్ రెడ్డి, ఏపీ కృష్ణ, ఎంఏ కలీం, మహమ్మద్ జహంగీర్, తున్ను, అబ్దుల్ ఖాదర్, షబ్బీర్, పొలం లక్ష్మణ్, గడ్డ మీది సాయి కుమార్, ఏదుర్ల విజయ్ కుమార్, గుమ్మకొండ సుధాకర్, తండు చందు, నూకం వెంకటేష్, ముడి లింగం, సాయిబాబా, జయవర్ధ న్, ప్రేమయ్య, జనార్ధన్, కొమ్ము ప్రమీల, ప్రవీణ్ రెడ్డి, బాలస్వామి గౌడ్, ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, సందీప్ రహమతుల్లా, రవి, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. B.R. Ambedkar Jayanti celebrated