TRINETHRAM NEWS

తాను చదువుకున్న పాఠశాలకు విరాళం
తేదీ : 01/02/2025. జీలుగుమిల్లి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం , అంకన్నగూడెం గిరిజన బాలికల పాఠశాలకు డైనమిక్ ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు రూపాయలు లక్ష విరాళం అందజేయడం జరిగింది. చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరత్నంకు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చి ప్రథమ స్థానాన్ని సాధించిన వారికి మంచి మనీ బహుమతి ఉంటుందన్నారు. క్రమశిక్షణతో 100,%, ఉత్తీర్ణత ఉండాలని , పాఠశాల నిమిత్తం ఏ అవసరం వచ్చిన నేనున్నాను అని భరోసా ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Chirri Balaraj