arath Chandra Pawar : డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

TRINETHRAM NEWS

డిండి గుండ్ల పల్లి త్రినేత్రం న్యూస్. 22-02-2025. నాడు డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. మీట్ యువర్ ఎస్పి కార్యక్రమంలో భాగంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సుదూర ప్రాంతాల ప్రజల కు మండల స్థాయిలోనే తక్షణ పరిష్కార దిశగా చర్యలు.

దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని డిండి పోలీస్ స్టేషన్ సందర్శించి సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిసరాలు స్థితిగతుల గురించి ఎస్సై ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ స్టేషన్ రైటర్ లాకప్ ఎస్ హెచ్ ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలగజేసేలా పనిచేయాలని అప్పుడే ప్రజలలో పోలీస్ శాఖ పైన నమ్మకం కలుగుతుంది అన్నారు

అనంతరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో విశేష స్పందన వచ్చింది. మండల పరిధిలోని దాదాపు 26 మంది ఫిర్యాదుదారులు ఎక్కువగా భూ సమస్యలు కుటుంబ వివాదాల పైన జాబ్ ఇప్పిస్తామని మోసం చేశారని సైబర్ క్రైమ్ వివిధ సమస్యల పట్ల ఎస్పీ గారిని కలవడం జరిగింది. జిల్లా ఎస్పీ ఫిర్యాదు ఆరులతో వారి సమస్యల పట్ల ముఖాముఖి మాట్లాడి పరిశీలించి సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
మారుమూల గ్రామాల్లోని ప్రజలు జిల్లా కేంద్రానికి రాలేక బందులు పడుతున్నారని దీని కొరకు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించటమే ధ్యేయంగా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఇకనుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తక్షణ పరిష్కారం కొరకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, డిండి సిఐ సురేష్, ఎస్సై రాజు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SP Sarath Chandra Pawar

You cannot copy content of this page

Scroll to Top