ఆయిల్ పామ్ పంట సాగుపై జిల్లా స్థాయి రైతు అవగాహన సదస వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ లోని IDOC మీటింగ్ హాల్ లో ఉద్యాన శాఖ మరియు ఇకోపామ్ ఆయిల్ అండ్ ఫట్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగు మీద అవగాహన కల్పించడంజరిగింది.ఔత్సాహికులైన రైతులు మరియువ్యవసాయ శాఖ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.వికారాబాద్ జిల్లా పాలనాధికారి ప్రతీక్ జైన్, ఐఏఎస్ మాట్లాడుతూ ఇన్ని పథకాలు సబ్సిడీలు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందు ముందు ఫ్యాక్టరీ నిర్మాణం మరియు కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు.
M.A. సత్తార్ జిల్లా ఉద్యాన అధికారి, ఆయిల్ పామ్ సాగు గురించి వివరంగా చెప్పారు. ఆయిల్ పామ్ పంటకు నేల, నీరు, పోషకాలు ఆవశ్యకత గురించి వివరించారు. ఆయిల్ పామ్ పంట యొక్క ఆవశ్యకత, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు గురించి వివరించారు. మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, వికారాబాద్ జిల్లా, మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా నేల రకాలు, గురించిమాట్లాడారు.
Dr. శ్రీవిజయన్, Scientist, PalmElit సీడ్ కంపెనీ, మాట్లాడుతూ ఇండోనేషియా లో వర్షపాతం భారత దేశ వర్షపాతం కంటే రెండున్నర ఇంతలు ఎక్కువున్నప్పటికి భారత దేశం లో ఆయిల్ పామ్ మంచి పెరుగుదలచూపిస్తుందనిఅన్నారు. 3-5 సంవత్సరాల్లో మంచి ఆదాయాన్నిఇస్తుందనిచెప్తున్నారు. ఇండోనేషియా రైతులు ఈ పంట వల్ల ధనవంతులుగా మారారని చెప్పుకొచ్చారు. ఇదే భారతదేశం లోకూడాజరుగుతుందనిభావించారు. ఇక్కడి రైతులు ఆయిల్ పామ్ తో పాటు అంతరపంటలు వేసి ఇంకాఎక్కువలాభాలుసాధిస్తున్నారని చెప్పారు.Dr. Y.S. రంగనాయకులు కన్సల్టెంట్, ఎకోపామ్ ఆయిల్ మరియు ఫ్యాట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ఈ పంటకు దొంగల బెడద, కోతుల బెడద, దళారీల బెడద ఉండదని చెప్పారు. ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీ గెలలను కొనుగోలు చేయాలని చెప్పారు. సాంకేతిక సహాయం అందించే సిబ్బంది కంపెనీతరఫున ఉంటారని వివరించారు. ఇట్టి కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లింగ్య నాయక్ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది మరియు ఎకోపాం ఆయిల్ పామ్ ఆయిల్ మరియు ఫ్యాట్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App