TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో జనసేన పార్టీ నాయకులు మోతే రవికాంత్ ఆధ్వర్యం లో ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన కార్యనిర్వాక కార్యదర్శి మంథని శ్రవణ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించడం జరిగింది
శ్రావణ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం భారతదేశమంతా ఉత్సవాలు చేసుకుంటుంటే నా దేశానికి ఒక ప్రత్యేకమైనటు వంటి రాజ్యాంగం కావాలని ఆలోచించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రస్తుత కాలంలో యువత అందరూ కూడా భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని సమజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బండారి తిరుపతి, ఆశ్రిత్ గౌడ్ , షంషీర్, తుంగపెల్లి కుమార్ మనోజ్, దగడు సాయి , మనోజ్ కుమార్ , సుధాకర్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Janasena leaders