ఇంటింటి సర్వే వివరాలను పకడ్బందీగా సేకరించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలి
*పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, నవంబర్ -11:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా జిల్లాలోని కుటుంబాల వివరాలను పకడ్బందీగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను పరిశీలించారు.
పెద్దపల్లి మండలంలోని కాపులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, కాసులపల్లి, పాలితం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే ను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పక్కగా చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని, ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కావడానికి వీల్లేదని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి రోజు 15 కుటుంబాల వివరాలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాల వద్ద వచ్చిన ధాన్యాన్ని ప్యాడి క్లీనర్ల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులు అందుబాటులో పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి ఎం. శివ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు అహ్మద్ బాషా, లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App