District Collector Koya Harsha said that girl students should get better results in exams
*సుల్తానాబాద్ భూపతి పూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన
పెద్దపల్లి, సెప్టెంబర్ -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదివే విద్యార్థినులు రాబోయే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సుల్తానాబాద్ భూపతి పూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు.
పాఠశాల అడాప్షన్ ప్రోగ్రాం లో భాగంగా ప్రీతి పల్లెపాటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు వంశీ మెషిన్స్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ , తెలంగాణ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ , ప్రాజెక్టు మేనేజర్ మెర్సీ మేరి ఆధ్వర్యంలో కేజీబీవీలో నూతనంగా నిర్మించిన రూ.7 లక్షల విలువైన 10 అదనపు టాయిలెట్లను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, కేజీబీవీలలో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటూ బాలికలు చదువులో రాణించాలని కలెక్టర్ అన్నారు. బాలికలకు అవసరమైన ఇతర సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటామని, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థిని మెరుగైన ప్రదర్శన కనబడుచాలని అన్నారు.
కేజీబీవీలో ప్రతి విద్యార్థిణి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పాస్ కావాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. కేజీబీవీలలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. కేజీబీవీలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్లను శుభ్రంగా మెయింటైన్ చేయాలని అన్నారు.
నల్ల ఫౌండేషన్ చైర్మన్ నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాల అడాప్షన్ కార్యక్రమంలో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికల సౌకర్యార్థం 10 ఆదనపు టాయిలెట్లను నెలన్నర క్రితం ప్రారంభించి పూర్తి చేశామని అన్నారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదివే బాలికలు అందుబాటులో ఉన్న సౌకర్యాలు వినియోగించుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతి పల్లెపాటి,తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్, ప్రాజెక్టు మేనేజర్ మెర్సి మేరీ, నిర్మాన్ ఆర్గనైజేషన్ సీనియర్ మేనేజర్ మహేష్ కుమార్, జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ కవిత, స్పెషల్ ఆఫీసర్ స్వప్న ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.