District Collector felicitated the students who showed best performance in karate competitions
పెద్దపల్లి, జూన్ -14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అభినందించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా నుంచి కరాటే పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ లతో కలిసి అభినందించారు.
గత నెల 19న గోవాలోనీ మనోహర్ పారీకర్ ఇండోర్ స్టేడియంలో యూనివర్సల్ 369 షోటోకాన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో కాల్వ శ్రీరాంపూర్ మండలం జడ్పిహెచ్ఎస్ వెన్నంపల్లి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సిహెచ్.వైష్ణవి, నిహారిక , ఈ.శ్రీనిత , ఈ. శ్రీహర్షిని, 10వ తరగతి చదువుతున్న నిదర్శిని పాల్గొని కాటా విభాగంలో నాలుగు బంగారు పతకాలు, ఆయుధ కాటా విభాగంలో ఒక వెండి, ఒక కాంస్య పతకాలను సాధించగా,జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ లు అభినందించారు.
అదేవిధంగా రామగుండం లోని సాక్రెడ్ హార్ట్ హై స్కూల్ కు చెందిన అమృత్ సాయి అనే విద్యార్థి మలేషియాలో నిర్వహించిన పదవ అంతర్జాతీయ ఓకినావా గోజుర్యు ఎపోసిటి కరాటే ఛాంపియన్ షిప్ లో పాల్గొని అండర్ 16 క్యాటగిరిలో బంగారు పతకం, వెటరన్ క్యాటగిరిలో వెండి పతకం సాధించగా సదరు విద్యార్థిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు కే.శ్రీనివాస్, కరాటే మాస్టర్ కాల్వ రమేష్, కరాటే డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App