TRINETHRAM NEWS

విద్యార్థి దశ నుండే తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి – జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం ) జిల్లా ఇంచార్జ్ : విద్యా ప్రమాణాలు మెరుగుపరచటానికి, ప్రభుత్వం పటిష్ట చర్యలు. ప్రభుత్వ నిర్ణయాల్లో తల్లిదండ్రులు భాగస్వామ్యం. విద్యార్థి దశ నుండే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి,ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని,జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, డౌనూరు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో, నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థి దశనుండే భవిష్యత్తులో ఏ అవ్వాలో నిర్ణయించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులు చదువులను, సామ్రాజ్యాలను, పర్యవేక్షించాలని సూచించారు. మంచిగా చదువుతున్నది, లేనిది ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల,విద్య సామ్రాద్యాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారం, వారం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫై టీచర్లు ఉంటున్నారని, అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో రేటింగ్ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మార్గదర్శిని కార్యక్రమాన్ని అమలు చేశామని అన్నారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాల విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఇస్తామన్నారు. ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థుల మార్కులతో పాటు ఆరోగ్య సమస్యలు నమోదు చేయటం జరుగుతుందని చెప్పారు. విద్యార్థి బలాల, బలహీనతలు నందు చేస్తారని అన్నారు. క్రీడా ఫోటోలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీరావు,ఏటీడబ్ల్యూ ఏ క్రాంతికుమార్, ఎంఈఓ రాంబాబు,ఎంపీపీ రమేష్, సర్పంచ్ పొట్టికి భవాని, హెచ్ఎం ప్రభుదాసు, పలువు ఉపాధ్యాయులు,మండల స్థాయి అధికారులు, పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App