TRINETHRAM NEWS

Distribution of TLM kits for intellectually disabled students

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు స్థానిక భవిత కేంద్రం లో , కేంద్ర ప్రభుత్వ జాతీయ మేధో దివ్యాంగ వ్యక్తుల సాధికారిత సంస్థ (ఎన్.ఐ.ఈపి.ఐ.డి), సికింద్రాబాద్ ఆధ్యర్యంలో పెద్దపల్లి జిల్లాలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న మేధో దివ్యాంగ విద్యార్ధుల బాల బాలికలకు మొత్తం 15 మందికి టీచింగ్ లెర్నింగ్ మెటిరియల్ కిట్లు (టి.ఎల్. ఎం) జిల్లా విద్యాధికారి డి.మాధవి చేత పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డి.ఈ.ఒ మాట్లాడుతూ ప్రతిరోజు దివ్యాంగ విద్యార్ధులు వారి తల్లి తండ్రులు ఇంటి వద్ద , పాఠశాలలో ఈ టి.ఎల్.ఎం కిట్లు వినియోగించుకునేలా చేసి వారి సామర్ధ్యాల పెంపుదలకు తల్లి తండ్రులు , ఉపాధ్యాయులు దోహదం చేయాలని తెలియజేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్.ఐ.ఈపి.ఐడి సంస్థ కోర్డినేటర్ ఎస్.లకన్ బాబు , మండల విద్యాధికారి టి.సురేందర్ కుమార్, జిల్లా సహిత విద్యా కోఅర్డినేటర్ అజిమొద్దిన్ డబీర్, విలీన విద్య రిసోర్స్ ఉపాద్యాయులు, సి.అర్.పి లు, దివ్యాంగులు, మరియు వారి తల్లి తండ్రులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of TLM kits for intellectually disabled students