WhatsApp Image 2024 03 21 at 11.32.42
Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు తన కస్టడీ అక్రమం అంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
కొంత మంది అధికారులు తనను విచారించవద్దని.. కస్టడీలో తాను చెబుతున్న విషయాలు మీడియాకు లీక్ అవుతున్నాయని, విచారణ తర్వాత జైలుకు తీసుకెళ్లాలని ఇలా రకరకాల విషయాలు పిటిషన్ లో పెట్టారు. అన్నింటిని హైకోర్టు తోసి పుచ్చింది.
ప్రణీత్ రావు కస్టడీలో చెబుతున్న వివరాలతో పలువుర్ని సిట్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
