Dr. Yogita Rana IAS : పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం

TRINETHRAM NEWS

డాక్టర్ యోగితా రాణా ఐఏఎస్.

డిండి(గుండ్ల పల్లి )మార్చి 09, త్రినేత్రం న్యూస్.: పదవ తరగతి విద్యార్థులలో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ( ఐ ఎ ఎస్) సోమవారం ప్రత్యేక ప్రేరణాత్మక సెషన్‌ను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మధ్యాహ్నం 2:00 గంటలకు టీ-శాట్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం కొనసాగింది.

జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం:

స్థానిక జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ గోప్యా నాయక్ మాట్లాడుతూ, పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగాచదువుకోవాలనిసూచించారు. ఉన్నతాధికారుల సూచనల ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కొనే మెళకువలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు పదవ తరగతి చదువుతున్నవిద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యాశాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Directions to Class 10 students

You cannot copy content of this page

Scroll to Top