జూలై 23, 2026

WhatsApp Image 2024 01 06 at 12.59.44 PM

TRINETHRAM NEWS

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం రెండు రోజుల పర్యటన

Trinethram News : ఖమ్మం జిల్లా జనవరి 06
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

నేడు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి బయలుదేరి మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రానికి చేరుకుంటారు.

ఎర్రుపాలెంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతి నిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో బస చేయ‌నున్నారు.

ఆదివారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి ఉదయం 10:45 గంటలకు చేరుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మాల్లో పాల్గొన్న తర్వాత ఖమ్మం క్యాంపు కార్యాల యానికి చేరు కుంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాల యం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజా భవన్ కు చేరుకుంటారు…

You cannot copy content of this page