WhatsApp Image 2024 03 07 at 15.32.51
Trinethram News : ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఒంటిపూట స్కూళ్లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని.. వారి శ్రేయస్సు దృష్ట్యా మార్చి 11 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని STU ప్రభుత్వాన్ని కోరింది. అటు తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
