TRINETHRAM NEWS

Cybercrime Police conduct awareness seminar for Singareni S & PC security personnel on cyber fraud

రామగుండం పోలీస్ కమిషనరేట్

సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి S & PC security సిబ్బంది కి సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని లోనిఆర్ జి వన్ జిఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హల్ లో సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది కి సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీఐ జై కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి,సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు.

ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా ద్వారా ఫిర్యాదు చేయాలని సిబ్బంది కి సూచించారు.

అవగాహన కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సిబ్బంది, వెంకటేష్, శ్రీనివాస్, శ్రీధర్ మరియు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ ఉమేష్,అక్బర్ అలీ, చంద శ్రీనివాస్, జమదర్ శ్రీనివాస్
సెక్యూరిటీ సిబ్బంది మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cybercrime Police conduct awareness seminar for Singareni S & PC security personnel on cyber fraud