
వందేళ్లుచరిత్ర గల పార్టీ సిపిఐ.
కాకినాడ,మార్చి,25 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కౌన్సిల్ విస్తృతస్థాయి సమావేశం కాకినాడలో స్థానిక ఎస్ టి వి భవన్లో మంగళవారం ఉదయం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ డేగ ప్రభాకర్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు లు హాజరయ్యారు. ప్రభాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల స్పందనకై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు రాజకీయ ప్రచార జాతలను ప్రారంభించాలని పిలుపునిచ్చిందని ప్రభాకర్ రావు అన్నారు.
ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో రాజకీయ ప్రచార జాతను ప్రజా సమస్యల స్పందన కై త్వరలో ప్రారంభిస్తామని అన్నారు, వందేళ్ళ చరిత్ర గల పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కమ్యూనిస్టు పార్టీలో పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నదని, దున్నేవాడికే భూమిని, రాజ్య ఆభరణాల రద్దని, బ్యాంకులను జాతీయకరణం చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునాదికి కమ్యూనిస్టు పార్టీ కీలకపాత్రహించిందని, అనేక భూ పోరాటాలు చేసిన ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదని ఆయన అన్నారు.
ఇల్లు లేని నిరుపేద కుటుంబాల అందరికీ ఇళ్ల స్థలాల లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పటికీ ఇళ్ల స్థలాలపై అప్లికేషన్లు నమోదు చేయిస్తుందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు భూమి అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు భూమి ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయల లోన్లు తక్షణమే మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. తాటిపాక మధు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కు ప్రజాసంఘాలు పట్టుకొమ్మలాంటివని, జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు త్వరలో జరగనున్నాయని, దాని ముందు శాఖ మహాసభలు, మండల మహాసభలు, జిల్లా మహాసభలు జరుపుకోవాలని ఆయన అన్నారు.
కమ్యూనిస్టు పార్టీ ప్రజల ఆదరణ పార్టీ అని ఈ పార్టీను ప్రజలే బ్రతికించుకోవాలని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ తక్షణమే అమలు చేయాలని, తల్లికి వందనం పథకం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకం అమలు చేయాలని, వేసవికాలం రీత్యా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి కూలీలకు పనులు సమయంలో బరకాలు లేక టెంట్లు వేయించి మంచి నీళ్లు సౌకర్యం ఏర్పాటు చేయించి ఓరాస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేటట్లు ప్రభుత్వం తగినచర్యలు తీసుకోవాలని, కార్మికులకు సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ముందుగా గుర్తించి వాటిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొబ్బిలి శ్రీనివాస్, పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ ఆరుగుల భవాని,పి. సత్యనారాయణ, తుపాకుల లక్ష్మీనారాయణ, అర్జున్ రావు, రామయ్య, స్వామి బాబు, మోహన్, అనిల్, మడగల రమణ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
