
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని అంబెడ్కర్ నగర్ మరియు పీజేఆర్ నగర్ లో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి, స్వతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, దేశంలోనే ప్రముఖ న్యాయనిపుణుడిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా అంబేడ్కర్ ఎంతో ప్రసిద్ధిగాంచారని గుర్తుచేశారు.
అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని, పేద, బడుగు బలహీనులకు రాజ్యాంగ పరంగా అనేకచట్టాలు తెచ్చి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహానీయుని బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శమని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, దళిత నాయకులు, అంబెడ్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
