100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం
Trinethram News : హైదరాబాద్:జనవరి 06
తెలంగాణ లో కొత్త ప్రభు త్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీ హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు.
ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవ డంతో.. కొత్తది నిర్మించా ల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కారు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
వీటిని రాజేంద్రనగర్ పరిధిలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సి టీల్లోని స్థలంలో నిర్మించ డానికి అనుమతి ఇచ్చింది.
శిథిలావస్థకు చేరుకున్న తెలంగాణ హైకోర్టు భవనం
వ్యవసాయ, హార్టికల్చర్ వర్సిటీలో కొత్తగా నిర్మాణం
త్వరలోనే శంకుస్థాపన చేయనున్న రేవంత్ సర్కారు
హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట, బుద్వేలు గ్రామాల పరిధిలోని ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివ ర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని న్యాయ శాఖకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
బుద్వేలులోని 2,533 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాల యాలకు 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
హైకోర్టు నూతన భవన నిర్మాణ అవసరాల దృష్ట్యా ఆ భూమిలోని 100 ఎకరా లను కొత్త భవనానికి కేటా యించాలని నిర్ణయించి నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, న్యాయమూర్తులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నూతన భవన సముదాయం నిర్మాణ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. భవన నిర్మాణం ప్రతిపాదనలు, 100 ఎకరాలు అవసరం, వాటి కేటాయింపుల గురించి ఇరువురు చర్చించారు. దీనికి అనుగుణంగా భూకేటాయింపులపై సీఎం హామీ ఇచ్చారు