TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన

విజయోత్సవ పేరిట జరిగే సభలు ప్రజా పాలన కాదు నయవంచన పాలన రాక్షస పాలన రాబందుల పాలన

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాష్ట్రంలో పేద ప్రజల నడ్డి విరుస్తూ పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తూ రైతులను మోసం చేస్తూ యువతకు ఉద్యోగాల పేరిట ఉద్యోగ భృతి పేరిట ఇస్తానన్న ఉద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పాలన ఇది ముమ్మాటికి రాక్షసపాలని రాబందుల పాలనే ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించి సాగిస్తున్న సభల ను జరుపుకోవాలని ప్రజలు విశ్వసించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలన అనేక రాష్ట్రాలలో చరమగీతం పాడి ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలనకు ఇక కాలం చెల్లింది రాబోయే రోజులు పూర్తిగా కాషాయమయమవుతూ అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్న తరుణంలో అనుకోని తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీ ల పేరుతో 66 మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమేదో ఘనత సాధించామని ఆవిర్రవీగుతూ ప్రజా పాలన విజయోత్సభల పేరిట ఈరోజు పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి ఆ సభకు గత ప్రభుత్వాల వలెనే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రతిపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పరిపాలన సాగిస్తుంది దానికి నిదర్శనమే ఈ ముందస్తు అరెస్టులు ఈ ముందస్తు అరెస్టులతో గత ప్రభుత్వం అబాసపాలైంది మీరు నిజంగా ప్రజా పాలన సాగించినట్లయితే ప్రతిపక్షాలను నిరోధించాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష నాయకుల కార్యకర్తలను నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భంధించి మీరు సభలు జరుపుకుంటున్నారంటేనే ఇది ప్రజా పాలన కాదు ఇది రాక్షస పాలన ఇది రాబందుల పాలన అని మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు తేటతెల్లం చేస్తున్నాయి ఇలాంటి పాలన మునుముందు కూడా ఇంకా ఇలానే కొనసాగినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎవ్వరు అమాయకులు కాదు గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగానైతే గుణమాసం చెప్పారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రజలు అదే గుణపాఠం చెప్తారని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ అరాచకుపాలను అంతమొందించి రైతులను గాని విద్యార్థులను గాని ఇదేవిధంగా నువ్వు మోసం చేస్తూ పరిపాలన సాగించినట్లయితే వారికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాం ముందస్తు అరెస్ట్ లో భాగంగా ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో భారతీయ జనతాపార్టీ పెద్దపల్లి పార్లమెంటు కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ రామగుండం ఎన్టిపిసి మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్ మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఐదో డివిజన్ కార్పొరేటర్ కృష్ణవేణి టిఆర్ఎస్ అధికార ప్రతినిధి ఈదునూరి శ్రీకాంత్ తదితరులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App