
ఐసీసీ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత ఇండియన్ క్రికెట్ టీం కి అభినందనలు – మంత్రి పొన్నం ప్రభాకర్
Trinethram News : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియా కు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. దుబాయ్ లో జరిగిన ఫైనల్ భారత్ విజయం సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆద్యంతం జట్టు సమిష్టిగా పోరాడుతూ విజయం సాధించిందని కొనియాడారు.
కెప్టెన్ రోహిత్ శర్మ బృందానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్ లో న్యూజిలాండ్ తో ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
