
హైదరాబాద్ ధర్నాను అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామికం
గోదావరిఖని మార్చి-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ ముద్రించాలని, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను విఫలం చేసేందుకు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం కామ్రేడ్ షేక్ యాకుబ్ షా వలి, కామ్రేడ్ ఆర్ మధుసూదన్ రెడ్డి, కామ్రేడ్ పెద్ద బోయిన సతీష్ తదితర రాష్ట్ర నాయకత్వాన్ని అక్రమంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ మార్గాల ద్వారా అరెస్టులకు పూనుకుంటున్నది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక వర్గం కోటి మందికి పైగా ఉన్నారని, నేడు రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలతో, చాలీ,చాలని జీతాలతో వీరంతా సతమతమవుతున్నారని అన్నారు. 2021 లో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఐదు కనీస వేతనాల జీవోలను ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని, కనీస వేతనాల సలహా మండలి లో గల ప్రభుత్వము, యాజమాన్యం మరియు కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కనీస వేతనాల జీవోలను ఫైనల్ చేశారు కానీ అట్టి జీవోలను ప్రభుత్వం గెజిట్ చేయలేదన్నారు. 2021 జూన్ లో విడుదల చేసిన జీవోలను నేటికీ గెజిట్ ముద్రించకపోవడం దుర్మార్గం అన్నారు.
ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం, ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొందూ దొందే అన్న చందంగా పరిస్థితి ఉందన్నారు. 2021 లో విడుదల చేసిన 5 జీవోలలో జీవో నెంబర్ 21 సెక్యూరిటీ సర్వీసెస్, జీవో నెంబర్ 22 రోడ్ మరియు బిల్డింగ్ వర్కర్స్, జీవో నెంబర్ 23 స్టోర్ బ్రేకింగ్ వర్కర్స్, జీవో నెంబర్ 24 కన్స్ట్రక్షన్స్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వర్కర్స్, జీవో నెంబర్ 25 ప్రైవేట్ మోటార్ వర్కర్ ఇట్టి అయిదు జీవోలలో కనీస బేసిక్ వేతనం 18 వేల 19 రూపాయలుగా నిర్ధారించారు అన్నారు. ఆనాటి నుండి వీడిఏ పాయింట్లు కలుపుకుంటే నేడు అది 22 వేల రూపాయలు అవుతుందన్నారు. ఈ జీవోలను గెజిట్ చేస్తే వీటి ప్రాతిపదికగా మిగతా జీవోలను కూడా సవరిస్తే కార్మిక వర్గానికి ఒక మంచి ఊరట లభిస్తుందన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న ధరల వలన చాలీ,చాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమై కార్మిక వర్గం ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా జీవోలను సవరించకుండా కాలం గడపడం సరైంది కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వానికి విన్నవించినా పెడచెవిన పెట్టిందన్నారు. అందుకే గత ప్రభుత్వాన్ని కార్మిక వర్గం ఇంటికి పంపింది అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి తక్షణమే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు జీవోలను గెజిట్ చేయాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
