CM Revanth Reddy’s key statement on Hydra
Trinethram News : హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని, పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘ ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదు’’ అని హెచ్చరించారు.
‘‘హైడ్రా హైదరాబాద్‌కు మాత్రమే ఇప్పటివరకు పరిమితం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, చెరువులు నాళాలపై కూల్చివేతలకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. నిబంధనలు పాటించని భవనాలను కూల్చివేస్తాం. తొలి కూల్చవేత మొదలుపెట్టిందే కాంగ్రెస్ నేత పల్లం రాజు నుంచి. కేటీఆర్ ఫామ్ హౌస్‌కి అనుమతి సర్పంచి నుంచి తీసుకున్నాం అని అంటున్నారు. సర్పంచ్ ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వరు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు జరుగుతున్నాయి. గత పదేళ్లలో చెరువులను, నాలాలను కబ్జా చేసి కట్టినందుకు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేవలం ఐదు నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు సమయం పట్టిందని, సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదని ఆయన ప్రస్తావించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసిందని, 8 సీట్లలో బీజేపీ గెలవడానికి హరీష్ రావు పనిచేశారని విమర్శించారు. బీజేపీ – బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు.
అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నా కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలు తీసుకుని రావాలి. నేను కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని ఆధారాలతో అక్కడికి వెళ్లాను. కేటీఆర్‌కి దమ్ముంటే నా కుటుంబ సభ్యులు లేదా నావి అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలి. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాలను పాటిస్తున్నాం. చెరువులు, కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. సెక్రటేరియెట్, జీహెచ్ఎంసీ లాంటి భవనాలరగ సుప్రీంకోర్టు అనుమతి ఉంది. రాయదుర్గంలో కూల్చివేత సరైనదే. ఆ భూమి ప్రభుత్వ భూమి’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ కొడంగల్‌కు వెళ్తానంటే స్వాగతిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ కేటీఆర్ కొడంగల్‌కు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడాలి. కేటీఆర్‌ను వాళ్ల తండ్రి కేసీఆర్ నమ్మడు. కర్ణాటకలో వాల్మీకి స్కామ్‌తో మాకు సంబంధం లేదు. తెలంగాణ ఖాతాలు ఉన్నంత మాత్రాన మాకు సంబంధం ఉంటుందా?. వాల్మీకి స్కామ్‌లో బీఆర్ఎస్ నేతలకే లింకులు ఉండొచ్చు. డ్రగ్స్ కోసం కొంతమంది బీఆర్ఎస్ నేతలు బెంగుళూరు వెళ్లడం అందరికీ తెలిసిందే’’ అని సీఎం అన్నారు.
నేను రేవంత్ రెడ్డినని, తనకు, కేసీఆర్‌కు పోలిక ఏంటి సీఎం అన్నారు. ‘‘ నేను కొడంగల్, కోస్గి, కొండారెడ్డి పల్లికి మాత్రమే హెడ్‌ను కాదు. రాష్ట్రానికి హెడ్‌ను నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఆయన బయటకు రావాలి ప్రజల కోసం పోరాటం చేయాలి. కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడు హోదాలో జీతాలు ఇస్తున్నాం. జీతం తీసుకుంటున్నందుకు ప్రజల్లో తిరగాలి. ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పనిచేయకపోతే ఎలా?’’ అని సీఎం పేర్కొన్నారు.
రుణమాఫీపై ధర్నాలు చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ ధర్నాల్లో రైతులు లేరని, వాళ్ల పార్టీ కార్యకర్తలే ఉన్నారని విమర్శించారు. ‘‘హరీష్ రావు, కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు తిరిగి రైతుల లిస్టు తయారు చేసి కలెక్టర్లకు ఇచ్చి పదేళ్లు చేసిన పాపాలను కడుక్కోండి. పార్టీలో చేరేవారు మా పాలన నచ్చి చేరుతున్నారు. మేము ఎవరిని భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదు. మాకు కావలసినంత బలం ఉంది. చెరువులపై హరీష్ రావుకు మంచి అవగాహన ఉంది. అందుకే ఆయన హయాంలో కమిషన్ కాకతీయ వచ్చింది. చెరువుల కబ్జాలపై నిజనిర్ధారణ కమిటీ వేద్దాం. హరీష్ రావును ముందు పెడదాం. ఎవరి కబ్జాలు ఏంటో అప్పుడు తేలుతుంది.’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హరీష్ రావు దొంగ అని తనకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘రుణమాఫీపై హరీష్ రావు చేసిన సవాల్‌కు కట్టుబడి లేడు. రాజీనామా చేయకుండా హరీష్ రావు పారిపోయారు. ఓడిపోయిన దొంగ హరీష్ రావు. రుణమాఫీ అనేది నా కమిట్మెంట్ నేను చెప్పాను చేసి తీరాను. ఇచ్చిన హామీలపై మూడు పార్టీలు బహిరంగ చర్చలు జరుపుదాం. అన్ని పార్టీల మేనిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. అప్పుడు కూడా పారిపోవద్దు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. రుణమాఫీ కాలేదు అంటే కేటీఆర్, హరీష్ రావు గ్రామాలు తిరగాలి. రాష్ట్రంలో అన్ని గ్రామాలు తిరిగి రైతుల ఖాతాలను లిస్టు తయారు చేసి కలెక్టర్లకి ఇవ్వాలి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App