
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని రేవంత్ నిర్ణయం
Trinethram News : హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు(36.8 కి.మీ), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్(11.6 కి.మీ), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట(7.5 కి.మీ), మియాపూర్-పటాన్‌చెరు(13.4 కి.మీ), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ) మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను కేంద్రానికి పంపించిన రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశాలు
ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్
దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ ఖాన్ పేట వరకు పొడిగించాలని చెప్పిన సీఎం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
