
CM Revanth : త్రినేత్రం న్యూస్ : మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆడబిడ్డలను లక్ష్మీ దేవితో కొలిచే సంస్కృతి మనది. భూమిని భూమాతగా, దేశాన్ని భారత మాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది…. రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ… గత ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏనాడు వాళ్ల పార్టీ అధ్యక్షుడిగా మహిళను నియమించలేదు… మంత్రులుగా, కార్పొరేషన్ ఛైర్మన్లుగా, మునిసిపల్ ఛైర్మన్లుగా, మేయర్లుగా ఆడబిడ్డలు రాణించారు… చట్టసభల్లో మహిళలలకు రిజర్వేషన్ కల్పించాలని 2013 లో సోనియా గాంధీ పార్లమెంట్ లో బిల్లు పెట్టారు… రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు…. గత ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలను కూడా చెల్లించలేదు…. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు సున్నా వడ్డీ రుణాలను మంజూరు చేశాం
ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం…. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే కొందరు కడుపునిండా విషం నింపుకుని, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు… ఉచిత బస్సు రద్దు చేయాలని రోడ్డెక్కారు… అయినా వెనక్కి తగ్గకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నాం…. ఉచిత బస్సులో వెళ్లి మా ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు…. పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించాం… మహిళలలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించేలా ప్రోత్సహించాం
అదానీతో పోటీ పడేలా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్వహించేలా ప్రోత్సహించాం… కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడేలా ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నాం…. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలో 106 స్టాల్స్ ఏర్పాటు చేశాం… అమెజాన్ నుంచి ఫ్లిప్ జారీ వరకు ఆన్లైన్ లో స్వయం సహాయక ఉత్పత్తులను… ఎల్ నినో ఉందని వాతావరణ శాఖ చెప్పింది… కానీ మనం 553 బస్సులను ప్రారంభించికోగానే వరుణదేవుడు కరుణించాడు….
తెలంగాణ ఆర్ధిక ప్రగతి ఆడబిడ్డల చేతిలో ఉంది… ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం… మహిళా స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటి మందికి చేరాలి… ఈ వేదికగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా… కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది… 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం… వెయ్యి కాదు… 3 వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తాం… వ్యవసాయంలో అన్ని రకాల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అన్ని రకాల పంటలను వేసేలా రైతులకు అవగాహన కల్పించండి… ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా.. మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సమాఖ్య(SHG), మండల మహిళా సమాఖ్యలకు (MMS) చెక్కులను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి …. 553 బస్సుల అద్దె ఛార్జీల నిమిత్తం TGSRTC నుంచి మండల మహిళా సమాఖ్య(MMS)లకు రూ.20.34 కోట్ల చెక్కును అందజేసిన సిఎం… TGSRTC ద్వారా కొనుగోలు చేసి, నిర్వహించే ఈ 553 బస్సులకు నిధులు సమకూర్చిన మండల మహిళా సమాఖ్యలు (MMS).
ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున TGSRTC నుంచి MMS లకు ఇప్పటి వరకు మొత్తం రూ.20.34 కోట్లు అద్దె ఛార్జీలు చెక్కు రూపంలో అందజేసిన సిఎం. వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.500 కోట్ల చెక్కును విడుదల చేసిన సీఎం… రాష్ట్రంలోని మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ఆదా చేసిన రూ.10,700 కోట్ల చెక్కును అందజేసిన సీఎం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe