Trinethram News : హైదరాబాద్: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది..
రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితోపాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు భువనగిరి రహదారి, సిర్పూర్-కాగజ్‌నగర్ జాతీయ రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెనను మరోచోటికి మార్పు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరనున్నట్లు సమాచారం..