TRINETHRAM NEWS

మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో

ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియు
ప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల సన్మాన కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు యాదవ్ తో కలసి పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని)

ఈ సందర్బంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ…

జగన్ సంక్షేమ పథకాలు, పొందిన లబ్ది మీ మాటల్లో వింటుంటే చాలా ఆనందంగా ఉంది

పచ్చ మీడియాలో సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు

మంచి చేస్తున్న నాయకుడ్ని – మళ్ళీ సీఎం గా చేసుకుందాం

2014లో పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని పచ్చి మోసకారి చంద్రబాబు నాయుడు

నా రాజకీయ జీవితంలో, వ్యాపార జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూసాను కానీ – ప్రజల సంక్షేమం కోసం ఇంతలా పరితపించే ముఖ్యమంత్రి సీఎం జగన్ ఒక్కరు మాత్రమే

ప్రతీ గ్రామంలోనూ విలేజ్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలను – 14 రకాల పరీక్షలు,140 రకాల మందులను అందచేస్తున్న ఘనత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ది

ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఒక మెడికల్ కాలేజీలు, 100 నుండి 500 పడకల ద్వారా హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నారు

విజయవాడ నడిబొడ్డులో డా.బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి i)ఆయన మీద గౌరవాన్ని ii) ఆయనలా మన పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థాయిలకు వెళ్లాలని iii) పర్యాటకంగా అభివృద్దిని చేస్తున్నారు

అభివృద్ధి లేదంటున్నారు – ప్రజల వద్దకే అన్నీ సేవలను అందించే సచివాలయాల ద్వారా ప్రజా పాలనను, రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సహాయాన్ని, ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజా శ్రేయస్సును కోరుకుంటూ ప్రజల సంతోషం అభివృద్ధి కాదా అని అడుగుతున్నా?

బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ అని పచ్చి మోసగాళ్లు వస్తున్నారు

చంద్రబాబుకు, లోకేష్ లకే షూరిటీ ఇచ్చేవాళ్ళు లేరు – ఇక మన భవిష్యత్ కు వాళ్ళు గ్యారంటీ ఇవ్వడం ఏంటి!

కరోనా వల్ల 2 సంవత్సరాలు కష్టపడ్డా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.2 లక్షల 50 వేల కోట్లు ఇచ్చారు

ఈ సారి గెలిపిస్తే 5లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ఇస్తారు

అతి సామాన్య కార్యకర్త,మన అందరివాడు, అందరికీ అందుబాటులో ఉండే మన మనిషి సర్నాల తిరుపతిరావు యాదవ్ ని, హేమా హేమీలు ఉన్న నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి

జగన్ మన కోసం దాదాపు 250 సార్లు బటన్ నొక్కారు – ఈ ఎలక్షన్స్ లో మనం 2 సార్లు బటన్ నొక్కి

వైఎస్ఆర్సిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించడం ద్వారా మళ్ళీ సీఎం గా జగన్ ని గెలిపించుకుందాం

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఎంపీపీ పాలడుగు జ్యోత్స్నా, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, మండల కన్వీనర్ బొంతా సాంబశివరావు, మునిసిపల్ కౌన్సిలర్ జోగి. రాము, మండల జేఏసీ కన్వీనర్ వెంకటేష్, జి. కొండూరు ఎంపీపీ లక్ష్మి తిరుపతమ్మ, ఐటి వింగ్ నల్లమోతు ప్రసన్న బోస్, మున్సిపాలిటీ సచివాలయాల కో-ఆర్డినేటర్ లంకే అంకమోహన్ రావు, మండల సమాఖ్య ప్రెసిడెంట్ కొమ్మినేని. సౌజన్య, కొటికలపూడి ఎంపీటీసీ బండి. నాగమణి, జూపూడి ఎంపీటీసీ బాణావత్ నాగబాల, బీసీ సెల్ నాయకులు శివశంకర్ రావు, రైతు కన్వీనర్ గొట్టుముక్కల. పోతురాజు, సీనియర్ నాయకులు మేడపాటి. నాగిరెడ్డి, ప్రసాద్, దుర్గగుడి డైరెక్టర్ చింతా. శ్రీను, మండల కో-ఆప్షన్ సభ్యులు నాగులమీరా, దొనబండి ఎంపీటీసీ స్వామి, ఈలప్రోలు సర్పంచ్ రంగారావు మరియు DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎంపిడివో ఉమాదేవి, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.