అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
CM holds teleconference

స్థానిక ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

‘చెప్పాం-చేస్తున్నాం’ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని టీడీపీ అధినేత ఆదేశం

మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేనని స్పష్టం

టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…

CM holds Teleconference : త్రినేత్రం న్యూస్ : 2024 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రచారానికి ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి. 2024 ఎన్నికల్లో లభించిన అద్భుత విజయం తర్వాత… ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ వస్తున్నాం. 151 సీట్లతో గెలుపొంది అరాచకాలు చేసిన గొడ్డలి పార్టీకి కేవలం 11 సీట్లే ఇచ్చి నాడు ప్రజలు తిరుగుబాటు చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ… ప్రతి ప్రాంతానికీ లబ్ది చేకూర్చేలా పాలన సాగిస్తున్నాం. రికార్డులు సృష్టించేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
ఎన్నికల్లో చెప్పినవన్నీ చేస్తున్నాం… అందుకే ‘చెప్పాం-చేస్తున్నాం’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేశాం… చిన్న కులాలకు కూడా ప్రాధాన్యతనిచ్చాం. పాలనలో తామూ భాగస్వాములమనే సంతృప్తి ప్రతి ఒక్క వర్గానికి కలగాలి. ప్రభుత్వానికి… ప్రజలకు కూటమి పార్టీల కార్యకర్తలే వారధిగా నిలవాలి. కూటమి పార్టీలు చక్కటి సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పని చేయాలి. మిత్రధర్మాన్ని తప్పకుండా పాటించాల్సిందే. ఇందులో ఎలాంటి వెసులుబాటూ లేదు.
మూడు స్థాయిల్లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే కలిగే లాభాలను వివరించాలి. అగ్ర నేతలు మొదలుకుని… కార్యకర్త వరకు చేసే పనిని రికార్డ్ చేస్తున్నాం. పొత్తుల కారణంగా… రిజర్వేషన్ల కారణంగా… సోషల్ రీ-ఇంజనీరింగ్ లో భాగంగా కొంత మందికి అవకాశాలు దక్కలేదు. రాష్ట్రం, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపునిస్తాం. నామినేటెడ్ పదవులతో గౌరవిస్తాం. ప్రభుత్వం చేసే మంచిని వివరించడంతోపాటు… గొడ్డలి పార్టీ చేసే అరాచకాల పైనా ప్రజలను అప్రమత్తం చేయాలి.
గొడ్డలి పార్టీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలి. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడు.. కుటుంబ బంధాలనూ పట్టించుకోడు. వార్డూ… డివిజన్ మొదలుకుని ప్రతి స్థానంలోనూ కూటమి పార్టీల జెండాలు ఎగరాల్సిందే. కూటమి పార్టీలకు పాజిటివ్ ఓట్లు పడాలి… కూటమికి పాజిటివ్ ఓటు బ్యాంకు మరింత పటిష్టం కావాలి. ప్రతి ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసేలా చూడాలి. ప్రతి పోలింగ్ బూత్ లోనూ 2024 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు పడాలి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page