Trinethram News : బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఆమీర్ హైదరాబాద్ లోని ప్రగతిభవన్ వద్ద బారికేడ్లను డీకొట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా.. ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులపై ఒత్తిడి చేశాడు. అనంతరం రాహిల్ దుబాయ్ పారిపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రత్యేకంగా విచారణ జరిపి పంజాగుట్ట పోలీసులపై వేటు వేశారు. విచారణలో భాగంగా బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ సహకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. బోధన్ కు చెందిన షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను సైతం అరెస్టు చేసినట్లు సమాచారం.
సిఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్
Related Posts
పోలీస్ కమీషనరేట్ లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్
TRINETHRAM NEWS పోలీస్ కమీషనరేట్ లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్ శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల…
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో
TRINETHRAM NEWS ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామగుండం మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు,కోరు కంటి చందర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పట్టణంలోని తన నివాసంలో కలిసి…