TRINETHRAM NEWS

ప్రేమ, శాంతి, అహింసలను తెలియజేసేదే క్రిస్టమస్

శాఖవరపు వేణుగోపాల్.

ప్రేమ శాంతి అహింసలను తెలియజెప్పేదే క్రిస్మస్ అని పి.హెచ్.పి రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ అన్నారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయంలోని వృద్ధాశ్రమంలో ఒమేగా ప్రేయర్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో అన్ని దేశాల్లో జరిగే క్రిస్మస్ సందర్భంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. పండగల సందర్భంగా తోటివారికి భోజనము, నూతన వస్త్రాలను అందించడం బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ గ్లోరీని ఆయన అభినందించారు. గత 8 సంవత్సరాల నుంచి మైదుకూరు, నెల్లూరు, విజయవాడ, బద్రిపల్లిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఎంతో చదువుకొని ఉద్యోగం చేయకుండా సేవా కార్యక్రమాలను గ్లోరీ నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలువైన బెడ్ షీట్లు, పండ్లు వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గ్లోరీ, అనుముల జయప్రకాష్, శ్వేత, సిరి, వృద్ధాశ్రమనిర్వాహకులు సుందరం తదితరులు పాల్గొన్నారు.