
Trinethram News : స్థానిక “చిన్నారి” ప్లే అండ్ కిండర్ గార్టెన్ పాఠశాలలో ఈరోజు మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికేతర ఉపాధ్యాయులు మలయాళీ, మణిపూర్, జర్మనీకి చెందిన ఉపాధ్యాయులచే బోధిస్తున్న ఈ చిన్నారి పాఠశాల వార్షికోత్సవంలో ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ఆంగ్లంలో స్టోరీలు చెప్పడం, ఉపన్యాసాలు నిర్వహించడం ఆసక్తిని కలిగించింది.
ఈరోజు పిల్లలు వివిధ వేషధారణలలో ఆడి-పాడి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతో ఆనందపరిచి పలువురి ప్రశంసలు పొందారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు జానకిరామయ్య, లావణ్య ఉపాధ్యాయులు సిన్సి, సయోజ్య,పియా, మూయీస్,ఉమా, లక్ష్మి,సన్ షైన్, హర్షిత్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
