ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 06 10 at 12.06.01

TRINETHRAM NEWS

Chandrababu’s focus on cabinet composition in AP

Trinethram News : పవన్‎కు ఆ పదవి కేటాయించే అవకాశం..?

ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు.

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. బీజేపీ,టీడీపీ,జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషించారు. తమ పార్టీ మద్దతుతో మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ కూర్పుపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఆయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషిచేసేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు కూడా ఓవర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎవరికి ఏశాఖలు వరిస్తాయో తెలియాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవరకు వేచి చూడాల్సిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandrababu's focus on cabinet composition in AP

You cannot copy content of this page