
రాజమహేంద్రవరం : అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన చిన్నారి దొంతలా నిషిత శివన్ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ అభినందించారు. నిషిత శివన్ ఆయా రికార్డులు సాధించిన నేపథ్యంలో ఆ చిన్నారి తల్లితండ్రులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ కేతన్ గర్గ్ ను మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆ చిన్నారిని అభినందించారు. మూడు సంవత్సరాల 9 నెలల వయస్సులో అంతర్జాతీయ రికార్డులు సాధించడం మామూలు విషయం కాదన్నారు. భవిష్యత్తులో చిన్నారి నిషిత శివన్ మరిన్ని రికార్డుల సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
చిన్నారి నిషిత శివన్ ను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు దొంతల శివ, రమ్యలను వారు అభినందించారు. కాగా 27 రాష్ట్రాలు వాటి రాజధానులు, 16 జాతీయ చిహ్నాలు మరియు 7 ఖండాలు, 8 గ్రహాలు, శరీర భాగాలు, ఇంద్ర ధనస్సు రంగులు, రవాణా పరికరాలు, సహాయకులు, ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు, అడవి జంతువులు, వ్యవసాయ జంతువులు, బ్యాడ్ టచ్, సిగ్నల్స్ లైట్లు, రుతువులు, పండ్లు, నెలలు, వారాలు పేర్లను అతి సునాయాసంగా చెప్పడంతో చిన్నారి నిషిత శివన్ అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లను సొంతం చేసుకుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
