
డిసెంబర్ 30న జరిగే సిపిఐ భారీ బహిరంగ సభ ను జయప్రదం చేయండి.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. …
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ )100 వసంతాలను పురస్కరించుకొని ఈనెల 30 న, నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జి కళాశాలలో జరిగే సీపీఐ భారీ బహిరంగ సభ విజయవంతానికి డిండి మండల సీపీఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలనీ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి అన్నారు. శనివారం డిండి సీపీఐ కార్యాలయంలో జరిగిన సీపీఐ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన పల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ…
దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా సిపిఐ ఖ్యాతి పొందిందనీ,స్వాతంత్ర్యం కొరకు జరిగిన పోరాటంలో ఆనాడే అనేకమంది ఉరికంబాలు ఎక్కి ప్రాణ త్యాగాలు చేసిన వీరచరిత్ర కలిగిన సీపీఐ దేశ స్వాతంత్య్రం కొరకు ఫ్యూడల్ సంస్థానాల విముక్తి కొరకు తాడిత, పీడిత జనావళి కొరకు వేలాదిమంది ప్రాణాలను కోల్పోయిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు.ప్రజా సమస్యలపైన భూ సంస్కరణలు, ఇళ్ల స్థలాలు, పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి తదితర అంశాలపై ఉద్యమాలు చేపట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని,
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మొట్టమొదటిగా అంగీకారం తెలియజేసి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ సీపీఐ అన్నారు. ఉజ్వల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ, ( సిపిఐ )100 వసంతాల ఉత్సవాల సందర్భంగా నల్లగొండలో పట్టణంలో డిసెంబర్ 30న, ఎన్.జి.కాలేజి గ్రౌండ్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేసేందుకు మండల పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా సమితి సభ్యులు తూం బుచ్చిరెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి. మైనోద్దీన్,సీపీఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,సహాయ కార్యదర్శులు బొల్లె శైలేష్, తిప్పర్తి విజేందర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి రవీంద్ర శర్మ,గోరటి వెంకటయ్య,హనుమండ్ల కేశవులు,సోమిడి శ్రీనయ్య,నూనె వెంకటేశ్వర్లు,ఎలిమినేటి హుస్సేన్,వడ్డెమాను లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
