TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) ఏజెన్సీ లో 1/70 చట్టానికి లోబడి గిరిజనులకు మాత్రమే CCLA GO ms 30 రెగ్యులెసన్ స్కీమ్ 2025 అమలు చెయ్యాలి.

సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల నాగేశ్వర్రావు అధ్యర్యంలో గెమ్మెలి బొంజుబాబు అధ్యక్షతన పాడేరు సిల్వర్ నగర్ ఆఫిసులో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశించి నాగేశ్వర్రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ 5వ షెడ్యూల్ ఏరియాలో ల్యాండ్ రెగ్యులెసన్ యాక్ట్ 1970 అమలులో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన CCLA. GO ms 30 ఏజెన్సీలో గిరిజనులు కు మాత్రమే వర్తించేలా ఆదేశాలుఇవ్వలని, 5వ షెడ్యూల్ ఏరియ అల్లూరి జిల్లా వ్యాప్తంగా టూరిజం ప్రాంతం అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ,హుకుంపేట, పెదబయలు,పాడేరు,జి. మాడుగుల,చింతపల్లి, జీ కె వీధి. కొయ్యురు.

రాజ వమ్మంగి,గంగవరం. రంప చోడవరం,మారేడుమిల్లి మండలం లలో రోడ్డుకు ఇరువైపుల ప్రభుత్వ R&B భావనము ల స్థలలు పైన రెవిన్యూశాఖ మరియు పంచాయతీ రాజ్ శాఖ వారి అనుమతులు లేకుండ నే గిరిజనేతరులు వాణిజ్యసముదాయలు నివాస గృహములు నిర్మించి ఉన్నారని, అట్టి నిర్మాణంలు 1/70 చట్టం అతిక్రమణ జరిగిందని CCLA జి వో 30 కి వ్యతిరేకం అని జరుగుతుంది. దీనిపై రెవిన్యూ శాఖ & పంచాయతీ రాజ్ శాఖ ఎటువంటి నివారణకు చర్యలు తీసుకొని ఉండలేదని, ఇలాంటి నిర్మాణం వలన రాబోయే రోజుల్లో పట్టణ అభిహృద్ధికి ఆటంకము ఏర్పడుతుంది. నాన్ ట్రైబల్ ఆక్రమణలు లో ఉన్న వ్యాపారసముదాయలు అధికారులు స్వాదిన పరిచ్చుకొని, గిరిజననిరుద్యోగులు కు ఉపాధి కల్పించినట్లయితే ఏజెన్సీ లో నిరుద్యోగ సమస్యలు తలెత్తవని కావున అల్లూరి జిల్లా కలెక్టర్ 1/70 మరియు CCLA జి వో ms 30 అనుసరించి పైన తెలిపినమండలాలలో ప్రభుత్వ R&B స్థలము లో ఉన్న అక్రమ నిర్మాణం లను కూల్చివెయటకు ఆదేశములుఇవ్వాలని, వినతిపత్రం సమర్పించడమైనది.
ఈ కార్యక్రమం లో డివిజన్ మహిళ నాయకులు కొర్ర మల్లమ్మ డివిజన్ నాయకులు గెమ్మెలి బొంజుబాబు. కిల్లో రాజారావు.వంతల శ్రీను సోకెలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CCLA GO MS 30