TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు.. నిన్నటి దినం సాయంత్రం రాయచోటి మదనపల్లి రోడ్డులో స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా స్టంట్ లు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మరియు డ్రైవింగ్ లేని యువకులకు బండిని ఇచ్చిన యజమానిని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది.

కావున ప్రజలందరికీ పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి ఏమనగా.. తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ కూడా ఎలాంటి బైక్స్ ఇవ్వకండి. వారు అతి వేగంగా ప్రయాణించి ఏదైనా జరిగిన ఎడల అది ఆ తల్లిదండ్రులకే బాధను కలిగిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించవలసిందిగా, బాధ్యతగల తల్లిదండ్రులుగా, పిల్లల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రాయచోటి పట్టణ సీఐ, బి.వి.చలపతి ఓ ప్రకటనలో తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case registered against two