జూన్ 27, 2026
TRINETHRAM NEWS

బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లు ధ్వంసం

నిన్న రాత్రి బిగ్బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు. స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

You cannot copy content of this page